Kitchen cleaning tips and hacks: వంటగది చిట్కాలు

Kitchen cleaning tips and hacks:

రోజు శుభ్రపరచడం :

Kitchen cleaning tips and hacks: వంట గది చిట్కాలు

టాప్ కౌంటర్ శుభ్రంగా ఉంచుకోవటం:

వంట చేసిన ప్రతీ సారి కౌంటర్ ను తడి బట్టతో గాని లేదా ఏదైనా క్లీనర్ తో స్ప్రే చేసి గాని తుడిచేయండి. అప్పుడు కౌంటర్ టాప్ చాల శుభ్రంగా ఉంటుంది.ఇలా మనం వంట చేసిన ప్రతీ సారి చేయడం వల్ల కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా నే కనపడుతుంది.

కిచెన్ ఫ్లోర్ నీ శుభ్రంగా ఉంచుకోండి:

కిచెన్ ఫ్లోర్ నీ గజిబిజి గా ఉంచుకోకుండా,చెత్తని ఊడ్చేస్తూ ఉండండి.మనం వంట చేసినప్పుడు కూరగాయలు తరిగి చెత్త అంతా కింద వదిలేస్తూ ఉంటాం ,అలాగే వంట కి అవసరం అయిన వాటిని అన్ని తీసుకున్నప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదా,అలాంటివి అన్నీ కింద చెత్త లాగా ఏర్పడిపోతాయి . కాబట్టి అలా కాకుండా పని అవ్వగానే చెత్త నూ ఊడ్చేస్తు ఉండండి.అప్పుడు కింద ఫ్లోర్ కూడా చాల శుభ్రంగా ఉంటుంది.

సింక్ శుభ్రపర్చుకోవటం:

పాత్రలు తొమిన వెంటనే సింక్ ను నీళ్ళతో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి,ఇంకా మెరుగైన క్లీనింగ్ కోసం వంట సోడా ను ఉపయోగించండి.ఇలా చేయడం వల్ల కూడా కిచెన్ లోని సింక్ ఏటువంటి వాసన రాకుండా బాగుంటది.

Kitchen cleaning tips and hacks: వంట గది చిట్కాలు

పాత్రలు తొమేయడం:

పాత్రలు సింక్ లో ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎప్పటి సామాన్లు అప్పుడే కడిగేయటానికి try చేయండి .అలాగే సింక్ లో సామాన్లు ఎక్కువగా వుంటే మైండ్ కూడా సరిగ్గా పని చేయదు కదా.అదే సింక్ లో సామాన్లు ఏవీ లేకపోతే మైండ్ చాలా relax గా అనిపిస్తుంది

వీక్లీ క్లీనింగ్:

వస్తువులను క్లీన్ చేసుకోవటం: 

ఫ్రిడ్జ్, ఓవెన్ mixi, స్టవ్ వంటి వాటిని వారానికి ఒకసారి ఏదైనా మంచి తడి బట్టతో తుడిచి పెట్టుకోండి.ఇలా చేయటం వలన దీన్ల పైన దుమ్ము ,ఇంకా అలాగే నూనె మరకలు ,వంట చేసేటప్పుడు అయినటువంటి ఏవైనా మరకలు ఉంటే శుభ్రంగా అవుతాయి,లేదంటే ఇలాంటివే చాలా stubborn మరకలు గా మారే అవకాశం ఉంటుంది.

ఫ్లోర్ నీ శుభ్రంగా ఉంచటం:

వారానికి ఒకసారి కచ్చితంగా కిచెన్ ఫ్లోర్ నీ డిస్ఇన్ఫెక్టెంట్ నీళ్ళతో శుభ్రంగా తుడుచుకోండి.అంటే మనం ఇల్లు తుడ్చుకుంటాం కదా అప్పుడు కచ్చితంగా ఏదైనా ఒక ఫ్లోర్ క్లీనర్ నీ వేసి శుభ్రంగా తుడ్చుకోండి.ఇలా చేయడం వల్ల జెర్మ్స్ ఏవీ ఉండవు.

వంట సామాగ్రి చెక్ చేసుకోవటం:

వంట చేసే అప్పుడు కావాల్సినవి అన్ని తీసుకుని మళ్ళీ ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటాం కదా,వాటి అన్నిటినీ వారానికి ఒకసారి neat గా సర్దుకోండి.ఏవైనా expire అయినవి ఉంటే వాటిని పడేయండి.ఇలా చేయడం వలన కిచెన్ గందర గోళం గా కనపడకుండా ఉంటుంది.ఎవరైనా మన ఇంటికి సడెన్ గా వచ్చిన చూడటానికి బాగుంటుంది.

నెలవారీ క్లీనింగ్:

ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ :

ఫ్రిడ్జ్ లొ ఉన్న వాటిని అన్నిటినీ తీసేసి, ఫ్రిడ్జ్ షెల్వ్స్ అన్నిటినీ వినెగార్ mix చేసుకుని ఉన్న నీటితో  క్లీన్ చేసి మరీ పొడి బట్ట తో తుడుచుకుని, బాగా ఆరిన తర్వాత మళ్ళీ అన్ని సర్దుకోండి.ఫ్రిడ్జ్ లో మనం తినేవాటిని అన్నిటినీ అన్నీ పెడ్తూ ఉంటాం కదా ,అప్పుడు ఏవో ఒకటి పడిపోతూ ఉంటాయి ,అలా పడిపోయినప్పుడు వెంటనే తుడ్చేయండి. మంత్ తర్వాత క్లీన్ చేద్దాం అని అలాగే ఉంచితే ఫ్రిడ్జ్ మొత్తం స్మెల్ వచ్చేస్తుంది.తినే వాటిని ఉంచుకుంటం కాబట్టి ఫ్రిడ్జ్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

Kitchen cleaning tips and hacks: వంట గది చిట్కాలు

చిమ్నీ మరియు exhaust fan క్లీనింగ్:

డిష్ వాష్ వాటర్ తో అయినా లేదంటే డిగ్రీసర్ స్ప్రే తో అయినా వీటిని శుభ్ర పర్చుకోండి.చిమ్నీ నీ డిష్ వాషర్ తో శుభ్ర పరచిన కూడా చాల సులభంగా శుభ్ర పర్చుకోవచ్చు.

అప్లయెన్సెస్ వెనుక భాగం:

ఫ్రిడ్జ్ వెనుకాల చాల దుమ్ము ఉంటుంది ,అలాగే స్టవ్ వెనుకాల ఇలా అన్నిటి వెనకాల దుమ్ము నీ తీయండి.దుమ్ము అనేది కచ్చితంగా నెల లో ఒకసారి దూలిపేయండి.లేదంటే మరీ ఎక్కువగా పేరుకు పోతుంది.సో జాగ్రత్తగా నెల నెల దుమ్ము నీ దూలిపేయండి.

Kitchen cleaning tips and hacks: వంట గది చిట్కాలు

Simple చిట్కాలు:

మెరుపు కోసం

మి ఇంట్లో స్టీల్ సింక్ కు మరియు స్టీల్ taps కు నిమ్మాయక తో రుద్దితే  మురికి అంతా వెళ్ళిపోఈ సింక్ మరియు టాప్స్ బాగా మెరుస్తాయి.

మొండి జిడ్డు కోసం వంట సోడా:

వంట సోడా నీ నీళ్ళ తో కలుపుకుని ఒక పేస్ట్ ల చేసుకుని బాగా మాడిపోయిన గిన్నెలు మీద అలాగే గ్యాస్ కౌంటర్ టాప్ మీద ఏవైనా మొండి మరకలు ఉంటే అప్లై చేయండి, ఆ తర్వాత తడి బట్టతో తుడిచేయండి లేదంటే ఇవే చాల జిడ్డు మరకలు గా అందరికీ కనిపిస్తాయి.అలాగే చూడటానికి కూడా ఏమీ బాగుండదు.

వినేగార్ తో గ్రీస్ మరకలు:

గ్యాస్ స్టవ్ మీద గాని వంట చేసిన తర్వాత గోడల మీద గాని నూనే అంతా గ్రీస్ లాగా పేరుకు పోయి ఉంటుంది ,అలాగే ఎక్సాహస్ట్ హుడ్స్ మీద కూడా అలా ఉంటుంది వీటి పైన వైట్ వినెగార్ తో స్ప్రే చేసి క్లీన్ చెయ్యండి.చాల సులభంగా క్లీన్ అవుతాయి.

పాత టూత్ బ్రష్ల ను రియూజ్ చేయడం:

పాత బ్రష్ లతో చాల ఉపయోగాలు ఉంటాయి అందులో వీటిని చాల చిన్నగా ఉన్నటువంటి కార్నర్ నీ శుభ్రం చేయటం కోసం ఉపయోగించ వచ్చు , ఇంకా చాల వాటికి టూత్ బ్రష్ బాగా ఉపయోగ పడుతుంది.ట్రై చేసి చూడండి.

క్లటర్ తగ్గించటం:

కౌంటర్ టాప్ మీద అనవసరమైనవి అన్ని పెట్టకండి.అవసరం లేనివి అన్ని కబోర్డ్స్ లో గాని డ్రాయర్లు లో గాని ఉంచండి.దీని వల్ల వంట గది చాల స్పేసియస్ గా కనిపిస్తుంది.ఇరుకు ఇరుకు గా ఉండదు.

ఈ చిట్కాలను మీరు పాటిస్తే, మీ కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా,తల తలా మెరుస్తూ కనిపిస్తుంది.

Images From:Leonardo.Ai ChatGpt

“మీ బొడ్డు కొవ్వు ఇలా తగ్గించుకోండి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *