Financial tips in Telugu: ప్రతి ఒక్కరు తప్పక పాటించవలసిన 11 ఆర్థిక సూత్రాలు ఏవో తెలుగుకుందాం. నేటి రోజుల్లో అందరికీ ఒకే ప్రశ్న: డబ్బుని ఏలా పొదుపు చేయాలి,ఎలా వృద్ధి చేయాలి? సరైన ఆర్థిక ప్రణాళికతో మీరు మీ జీవితాన్ని సులభంగా మరియు భద్రంగా మార్చుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో మనం, సాధారణంగా అందరూ అమలు చేయగల కొన్ని ఆర్థిక చిట్కాలు తెల్సుకుందాం.
Table of Contents
1. బడ్జెట్ – మీ ఆర్థిక ప్రణాళికకు బలమైన పునాది (Important Financial tips in Telugu)
బడ్జెట్ అనేది మీ ఆదాయానికి తగినట్లు ఖర్చు చేసేలా మార్చుకోవటం,(నియంత్రణ సాధనం). ఇది అచ్చం పుస్తకంలో ఒక చాప్టర్ చదివినట్లు బోరింగ్ అనిపించవచ్చు కానీ నమ్మండి, ఇది మీ జీవితాన్ని క్రమశిక్షణగా మారుస్తుంది.
ఇంటి బడ్జెట్ ఎలా కేటాయించాలి ?
ముందుగా, మీరు సంపాదించేవి, ఖర్చుచేసేవి రెండు వేరు చేయండి.
ఉదాహరణకు:
అవసరమైన ఖర్చులు: ఇల్లు, కరెంట్ బిల్లు, కూరగాయలు.
అనవసరమైన ఖర్చులు: సినిమా టికెట్లు, రెస్టారెంట్ బిల్లు.
తప్పక పాటించాల్సింది:
మీ ఆదాయం తగ్గినా, ఖర్చు తగ్గించండి కానీ, పొదుపును మాత్రం తగ్గించవద్దు. ఈ సూత్రం మి ఆర్థిక ప్రణాళికకు బలమైన పునాదిగా మారుతుంది.
2. మొదట పొదుపు, తర్వాత ఖర్చు
మనందరం ఎక్కువగా పొదుపు చివరిగా చేసేందుకు ప్రయత్నిస్తుంటాం. కానీ, అసలు పద్ధతి అలా కాకూడదు. ముందుగా పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.
మీరు సంపాదించగానే, ఒక భాగాన్ని ఆటోమేటిక్‌గా సేవింగ్స్ అకౌంట్‌కి మార్చండి. ఇలా చేస్తే పొదుపు చేయడం మీకు అలవాటుగా మారుతుంది.
పొదుపు చేయడం ఎలా మొదలు పెట్టాలి ?
చిన్న చిట్కా:
నెలకు పది శాతం నుంచి ప్రారంభించండి. అది ఎలా పనిచేస్తుందో చూసి మీరు దీని percentage ni పెంచుకుంటూ పోవచ్చు.
3. అత్యవసర నిధి – ఆపదకాలానికి సిద్ధంగా ఉండండి
మీ జీవితంలో ఎప్పుడైనా అనుకోని పరిస్థితి ఎదురవచ్చు. ఆ సమయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు,ఒక అత్యవసర నిధి తప్పనిసరి గా ఉండాలి.
ఎంత దాచుకోవాలి?
కనీసం మూడు నెలల ఖర్చుకు సరిపోయేంత. అంటే, మీ నెలకు అవసరమయ్యే మొత్తం ₹30,000 అయితే, మొత్తం ₹90,000 వరకు అత్యవసర నిధి ఉంచాలి.
ఎక్కడ ఉంచాలి?
మీ నిధి సులభంగా అందుబాటులో ఉండే స్థలంలో పెట్టండి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, లేదా లిక్విడ్ ఫండ్ మంచి ఎంపికలు.
4. రుణాలను తగ్గించండి
మీ ఆర్థిక భవిష్యత్తును అప్పులు పాడు చేయకుండా జాగ్రత్తపడండి. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు ల ఉపయోగం ఎక్కువ అయిపోయింది.మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగం తెలివిగా చేయకపోతే సమస్యలకి దారి తీస్తుంది.
తొందరగా తీర్చేయండి:
అప్పులను ఎక్కువ రోజులు వదిలేస్తే వడ్డీ పెరుగుతుంది. మీ అప్పుల జాబితా నీ తీసుకుని, వడ్డీ రేటు ఎక్కువగా ఉన్న వాటిని ముందుగా తీర్చేయడం మొదలు పెట్టండి.
5. భద్రమైన పెట్టుబడులు చేయండి
మీ ఆదాయాన్ని పెంచుకోవాలంటే, సరైన పెట్టుబడులు తప్పనిసరి. ఇది కేవలం పెద్దల సలహా అనుకోవద్దు; ఇది మీ భవిష్యత్తుకు బలమైన ఆధారం.
మొదటి అడుగు:
చిన్న మొత్తాలతో మొదలుపెట్టండి. మ్యూచువల్ ఫండ్స్, FD, లేదా PPF వంటి భద్రమైన ఆప్షన్లు ట్రై చేయండి.
పెట్టుబడులు ఎందుకు పెట్టాలి:
మీ పెట్టుబడులు చక్కరవడ్డీ ద్వారా పెరుగుతాయి. మీరు ఎక్కువకాలం సొమ్ము పెట్టుబడిగా ఉంచితే, అది గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఉదాహరణ కు మనం సంవత్సరానికి 20% రిటర్న్ ఇచ్చే ఏదైనా Mutual fund లో 20 years పాటు 5000 ఇన్వెస్ట్ చేస్తూ వస్తే మనకు 20 ఇయర్స్ తరువాత మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 12,00,000 అయితే అది 1,58,00,000 రూపాయిలు అవుతుంది.
SIP Caluculator ద్వారా మీరు ప్రతి నెలా ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎత తిరిగి వస్తుందో తెలుసుకోగలరు.
6. మీ పరిధిలో ఉండండి
మనం ఎక్కువగా ఇతరుల జీవనశైలిని చూసి ఆకర్షితులవుతుంటాం. కానీ, అది అవసరమా అని ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
బాధ్యతగా ఖర్చు చేయండి:
మీ అవసరాలు, ఇష్టాల మధ్య తేడా గుర్తించండి. అరకొర అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేయవద్దు.
పరిధిలో జీవించడం అంటే?
ఇది మీ ఆదాయానికి తగిన ఖర్చు చేయడం. మీకు అవసరం లేని వాటి పై డబ్బు waste చేయకండి.
7. పెన్షన్ ప్లాన్లు ప్రారంభించండి
మీ రిటైర్మెంట్ ప్లానింగ్ మొదలుపెట్టాలి! అది ఎంత తొందరగా మొదలుపెడతారో, మీ భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుంది.
ప్రత్యేక స్కీములు ఎంచుకోండి:
ప్రావిడెంట్ ఫండ్ (PF), నేషనల్ పెన్షన్ స్కీం (NPS) వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.
8. ఆర్థిక విషయాల్లో నైపుణ్యం పెంచుకోండి
మీ సొమ్మును ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేది తెలుసుకోవడం ఆర్థిక స్వాతంత్ర్యం పొందడానికి ముఖ్యమైన అంశం.
ఎలాగంటే?
ఆర్థిక సాహిత్యంపై పుస్తకాలు చదవండి. ఆన్లైన్ ఫ్రీ వెబినార్లు, వీడియోలను చూడండి.
9. ఖర్చులను తరచుగా రివ్యూ చేయండి
మీరు చేసే ప్రతి ఖర్చుని ఒకసారి చూడండి. అవసరమా, లేదా అనేది నిర్ణయించుకోండి.
చిన్న మార్పులతో పెద్ద ఫలితం:
ప్రతీ నెలా మీరు చేస్తున్న ఖర్చులను విశ్లేషించండి. అవసరంలేని వాటిని తగ్గించడం అలవాటు చేసుకొండి.
10. ఆదాయ మార్గాలను పెంచుకోండి
మీరు చేస్తున్న ఉద్యోగంపైన మాత్రమే ఆధారపడకండి. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి.
ఎలాగంటే?
మీకు తెలిసిన నైపుణ్యాలు, హాబీలు ఏవి ఉన్నాయో గుర్తించండి. ఫ్రీలాన్స్ పనులు చేయడం, మీకు ఏవైనా handmade వస్తువులు చేయడం వస్తే వాటిని అమ్మడం వంటి మార్గాలు ప్రయత్నించండి.
11. సమయానికి ఇన్వెస్ట్ చేయండి
మీరు మానసికంగా, శారీరకంగా బాగా ఉన్నప్పుడే మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందుకే, శారీరక, మానసిక ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టడం మర్చిపోకండి.
ఈ చిట్కాలను పాటించడం వలన మీ జీవితం చాలా సులభంగ మారుతుంది. ఈ రోజు చిన్న మార్పులతో ప్రారంభించండి. రేపటి భద్రత కోసం ఇవి గొప్పగా ఉపయోగపడుతాయి.