స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
స్వామి మనతో షేర్ చేసుకున్న details ప్రకారంగా చూస్తే.
వారు 24 /12/2024 న ఇరుముడి కట్టుకుని బయలుదేరారు.వాళ్లు కార్ లో జర్నీ చేశారు.వాళ్లు బయలుదేరిన వంటి ప్లేస్ నుంచి పంపా కి రీచ్ అవటానికి 19 గంటల సమయం పట్టింది అని చెప్పుకొచ్చారు.
అంటే వాల్ల ఊరి నుంచి మధ్యానం 1 గంటకి బయలుదేరితే వారు అక్కడికి ( పంపా) తెల్ల వారు జామున 8 కి అంతా చేరుకున్నారు.
పంపా లో స్నానం చేసిన తర్వాత వాళ్లు చిన్న పాదం నీ ఎక్కడం ప్రారంభించారు.అంటే 10 కి అంతా స్వాములు కొండ నీ ఎక్కడం ప్రారంభించారు.
స్వాములు కొండ పైకి ఐతే 1 కి అంతా చేరుకున్నారు.కానీ ఆ రోజే,అయ్యప్ప స్వామి వారికి తమ పుట్టినిల్లు అయినటు వంటి పందలం నుంచి నగలు మరియు దుస్తుల పెట్టే ను తీసుకొచ్చారు అంట.అందుకని ఆ రోజు ఐతే 25/12/2024 వీళ్ళకి జరగవలసిన దర్శనం 2 నుంచి సాయంత్రం 6:30 వరకు ఆపేయడం జరిగింది.
ఆ తరువాత దర్శనానికి అనుమతిని ఇచ్చారు అంట.ఇంకా వారికి,10 :30 కి అంతా దర్శనం అయిపోయింది అని స్వామి చెప్పారు.స్వామి వారి దివ్య దర్శనం బాగా జరిగింది అని ఆయన అన్నారు.వీళ్ళ దర్శనానికి 12 గంటల సమయం పట్టింది.
అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత సన్నిధానం పైన మాత్రమె దొరికే అటువంటి అరవన పాయసం తీసుకుని మరల వెనుక ప్రయాణం గా కొండ దిగారు అని స్వామి చెప్పారు.
కేరళ అందాలు చూడటానికి రెండు కళ్ళు చాల లేదు అని స్వామి మనతో షేర్ చేసుకున్నారు.కేరళ లో ఫుడ్ ఐతే మనం తినలేము అని స్వామి వారు అన్నారు.
ఇంక రిటర్న్ వచ్చే అప్పుడు వీళ్లు ఇప్పుడు చాల ఫేమస్ అయినటువంటి కరుంగలి మాల దొరికే అటువంటి పాతాళ శంభు దేవుడి దర్శనం కూడా చేసుకుని వచ్చారు అని చెప్పారు.
అలాగే ఇంక దారిలో ఉన్న అటువంటి కాణిపాకం వినాయక నీ దర్శించుకుని వచ్చారు.
వీళ్లు రాయలసీమ అయినటువంటి కదిరి నుంచి పంబ కి వెళ్లి తిరిగి రావటానికి 3 రోజుల సమయం పట్టింది అని పేర్కొన్నారు.కార్ లో వెళ్ళారు కాబట్టి కొంచెం త్వరగా నే అయిపోయింది అని అన్నారు.కానీ కార్ లో వెళ్లే వాళ్లు చాల జాగ్రత్తగా వెళ్లాలి అని సూచించారు.
కేవలం కార్ లో ప్రయాణించే వారే కాకుండా ఇతర ఏ వెహికల్ లో వెళ్లే వారు అయినా కూడా జాగ్రత్తగా వెళ్లాలి అని సూచించారు.
మీకు గనుక న ఆర్టికల్ నచ్చినట్లు ఐతే మన వెబ్సైట్ ను ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరి ఎన్నో విషయాలను మీకు తెలియజేయడం మాకు చాల ఆనందంగా ఉంటుంది.
కొండ పైన స్వాములు చాలా ఎక్కువగా ఉన్నారని ఈయన అన్నారు. ఇరుముడి కట్టుకుని వెళ్లే ఏ స్వామి అయినా సరే జాగ్రత్తగా వెళ్లాలి అని చెప్పారు.మీరు ఎవరితో ఐతే వెళ్తారో వాళ్ళతో నే కలిసే ఉండండి అని సూచించారు.
అందువలన ఎవరు తప్పి పోకుండా ఉంటారు అని చెప్పారు.చిన్న పిల్లలను కూడా స్వామి మాల ధరింప చేసి కొండ కి తీసుకు వెళ్లే స్వాములు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏