Top 10 Home based online jobs for women in Telugu | మహిళల కోసం టాప్ 10 హోమ్ బేస్డ్ ఆన్‌లైన్ జాబ్స్

ఇంట్లో ఉన్న చాల మంది మహిళలు పెళ్లి అయిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాకుండా ఉంటారు,అలాగే పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళని వదిలి బయటికి వెళ్లి వర్క్ చేయడానికి ఇష్టం ఉండదు, అలాంటి వారు ఇంట్లో నే ఉండి డబ్బు అలాగే పేరు నీ కూడా సంపాదించుకోవచ్చు.

ఇంట్లో నుంచే చేయగలిగే సులభమైన ఆన్‌లైన్ ఉద్యోగాల గురించి తెల్సుకుందాం. వీటి కోసం పెద్దగా పెట్టుబడులు అవసరం లేదు

1.కంటెంట్ రైటింగ్ లేదా బ్లాగింగ్

మీరు ఆర్టికల్స్, బ్లాగ్స్, లేదా వెబ్‌సైట్ లలో కంటెంట్ రాసి డబ్బు సంపాదించవచ్చు.

ఎలా ప్రారంభించాలి: Upwork, Fiverr వంటి వెబ్‌సైట్లలో సైన్ అప్ అవ్వండి, లేదా మీకు అంటూ ఒక సొంత బ్లాగ్ ను ప్రారంభించండి.

అవసరమైన నైపుణ్యాలు: రాయడంలో ఆసక్తి, ప్రాథమిక SEO జ్ఞానం.

ఎంత సంపాదించవచ్చు: నెలకు ₹5,000 నుంచి ₹50,000 వరకూ.

2.వర్చువల్ అసిస్టెంట్

ఇమెయిల్స్, డేటా ఎంట్రీ, షెడ్యూల్స్ వంటి సులభమైన పనులు చేస్తూ డబ్బు సంపాదించండి.

ఎలా ప్రారంభించాలి: Freelancer, Remote.co వంటి వెబ్‌సైట్లలో జాబ్ కోసం అప్లై చేయండి.

అవసరమైన నైపుణ్యాలు: కంప్యూటర్ బేసిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్.

ఎంత సంపాదించవచ్చు: నెలకు ₹10,000 నుంచి ₹40,000.

3.ఆన్లైన్ ట్యూషన్

మీకు ఏవైనా సబ్జెక్ట్ బాగా తెలుసుంటే, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాస్ లు తీసుకోండి.

ఎలా ప్రారంభించాలి: Vedantu, Cambly వంటి ప్లాట్‌ఫారమ్‌ల్లో రిజిస్టర్ అవ్వండి.

అవసరమైన నైపుణ్యాలు: మీ సబ్జెక్ట్‌లో నైపుణ్యం, క్లియర్‌గా మాట్లాడగలిగే స్కిల్స్.

ఎంత సంపాదించవచ్చు: గంటకు ₹500 నుంచి ₹2,000.

4.డేటా ఎంట్రీ జాబ్స్

డేటా టైప్ చేసే సింపుల్ పనులతో కూడా డబ్బు సంపాదించవచ్చు.

ఎలా ప్రారంభించాలి: Naukri లేదా Freelancer వంటి వెబ్‌సైట్లలో డేటా ఎంట్రీ జాబ్స్ కోసం చూడండి.

అవసరమైన నైపుణ్యాలు: టైపింగ్ మరియు ఖచ్చితత్వం (accuracy).

ఎంత సంపాదించవచ్చు: నెలకు ₹5,000 నుంచి ₹25,000.

5. సోషల్ మీడియా మేనేజర్

సోషల్ మీడియా పేజీలను మేనేజ్ చేయటం అంటే example కి వేరే వాల్ల అకౌంట్స్ మీరు మేనేజ్ చేయటం బిజినెస్ ప్లాన్ చేయండి.

ఎలా ప్రారంభించాలి: YouTube లేదా Coursera లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో సోషల్ మీడియా మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోండి.

అవసరమైన నైపుణ్యాలు: క్రియేటివిటీ, Canva లాంటి టూల్స్ వినియోగించడం.

ఎంత సంపాదించవచ్చు: నెలకు ₹10,000 నుంచి ₹50,000.

6. అఫిలియేట్ మార్కెటింగ్

మీ బ్లాగ్ లేదా సోషల్ మీడియా ద్వారా ప్రొడక్ట్స్ నీ ప్రమోట్ చేసి కమిషన్ సంపాదించండి.

ఎలా ప్రారంభించాలి: Amazon Associates, Flipkart Affiliate వంటి ప్రోగ్రామ్‌లకు జాయిన్ అవ్వండి.

అవసరమైన నైపుణ్యాలు: కంటెంట్ క్రియేట్ చేయడం, ప్రమోట్ చేయడం.

ఎంత సంపాదించవచ్చు: నెలకు ₹5,000 నుంచి ₹1,00,000 (ట్రాఫిక్ మీద ఆధారపడి ఉంటుంది).

7. ఆన్లైన్ సర్వేలు

సర్వేలు పూర్తి చేయడం లేదా ఉత్పత్తులపై రివ్యూస్ రాయడం ద్వారా డబ్బు సంపాదించండి.

ఎలా ప్రారంభించాలి: Swagbucks, Toluna వంటి సర్వే వెబ్‌సైట్లలో జాయిన్ అవ్వండి.

అవసరమైన నైపుణ్యాలు: వీటికి స్పెసిఫిక్ స్కిల్స్ అంటూ ఏమీ లేవు.

ఎంత సంపాదించవచ్చు: నెలకు ₹1,000 నుంచి ₹5,000.

8. గ్రాఫిక్ డిజైన్

లోగోలు, పోస్టర్లు డిజైన్ చేసి డబ్బు సంపాదించండి.

ఎలా ప్రారంభించాలి: Canva లేదా Adobe Illustrator వంటివి నేర్చుకోండి. Fiverr లేదా Behance లలో మీ సర్వీసులు ప్రచారం చేయండి.

అవసరమైన నైపుణ్యాలు: క్రియేటివిటీ, ప్రాథమిక డిజైన్ స్కిల్స్.

ఎంత సంపాదించవచ్చు: ఒక్క ప్రాజెక్ట్‌కు ₹10,000 నుంచి ₹1,00,000.

9. హ్యాండ్ మేడ్ ఉత్పత్తులు అమ్మడం

మీరు తయారు చేసే జ్యువెలరీ, హస్తకళ, లేదా బేకింగ్ ప్రోడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మండి.

ఎలా ప్రారంభించాలి: Etsy, Amazon Handmade లేదా Instagram వంటి ప్లాట్‌ఫారమ్‌ల్లో అమ్మడం ప్రారంభించండి.

ఎంత సంపాదించవచ్చు: ఉత్పత్తి మీద డిమాండ్‌ను బట్టి ఉంటుంది.

10.రిసెల్లింగ్

దుస్తులు లేదా ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసి రీసేల్ చేయండి.

ఎలా ప్రారంభించాలి: Meesho లేదా Facebook Marketplace ఉపయోగించండి.

అవసరమైన నైపుణ్యాలు: ప్రాథమిక మార్కెటింగ్ స్కిల్స్.

ఎంత సంపాదించవచ్చు: నెలకు ₹5,000 నుంచి ₹30,000.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *