Cricket News In Telugu | India Vs South Africa 2nd T20I Highlights
125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 124/6 పరుగులుమాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.హార్దిక్ పాండ్య తప్ప, కీలక ఆటగాళ్ళు ప్రభావం చూపకపోవడంతో , సరైన భాగస్వామ్యాలను నిర్మించడం లో విఫలం అయ్యింది. సంజు శాంసన్ (0), అభిషేక్ శర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (4), తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27), రింకు సింగ్ (9) అందరూ దక్షిణాఫ్రికా బౌలింగ్ దెబ్బకి వికెట్లు సమర్పించుకున్నారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. వరుణ్ చక్రవర్తి కోటా పూర్తి అయిన తరువాత ఏ భారత బౌలర్లు కూడా దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ని ఒత్తిడికి గురిచేయలేక పోయారు.
మార్కో జాన్సెన్, ఆండిలే సిమెలేన్, గెరాల్డ్ కోట్జీ మరియు న్కబయోమ్జీ పీటర్ పవర్ ప్లే లోపే 3 వికెట్స్ తీసారు దీంతో భారత బ్యాట్స్ మెన్ ఒత్తిడి కీ గురి అయ్యారు. జాన్సెన్ మరియు కోట్జీ భారతదేశం యొక్క టాప్ ఆర్డర్ ని అణచి వేయగా, మిడిల్ ఓవర్లలో సిమెలేన్ స్కోర్ ని నియంత్రించి భారత అవకాశాలను మరింత కష్టం చేసాడు.ఫలితంగా భారత్ కేవలం 20 ఓవర్లలో 124/6 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్, ఐడెన్ మార్క్రామ్ (3) మరియు డేవిడ్ మిల్లర్ (0) వికెట్లను ప్రాంభంలోనే కోల్పోయింది. ఆ తరువాత హెన్రిచ్ క్లాసెన్ (2) మరియు ఆండిలే సిమెలేన్ (7) తో సహా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ, ర్యాన్ రికెల్టన్ (13) రీజా హెండ్రిక్స్ (24) మరియు ట్రిస్టాన్ స్టబ్స్ (47 పరుగులతో నాటౌట్) చిన్న చిన్న భాగస్వామ్యలతో దక్షిణాఫ్రికాను రేస్ లో నిలబెట్టారు, చివరి ఓవర్లలో కోట్జీ చేసిన 19 పరుగులు మరియు స్టబ్స్ చెలరేగి ఆడటంతో దక్షిణాఫ్రికా గెలుపు మరింత సులువు అయ్యింది.తదుపరి మ్యాచ్ బుధవారం, NOV 13 2024 న దక్షినాఫ్రికా లోని సూపర్ స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ లో 8:30 న జరగనుంది.
Check first T20I Highlights Here
- అయ్యప్ప స్వామి దర్శనం ఈ సారి ఎలా జరిగిందో మనతో ఒక స్వామి గారు షేర్ చేసుకున్నారు…..
- Top 10 Home based online jobs for women in Telugu | మహిళల కోసం టాప్ 10 హోమ్ బేస్డ్ ఆన్లైన్ జాబ్స్
- వైకుంఠ ఏకాదశి గురించి పూర్తిగా తెలుసుకోండి : Vaikunta ekadhasi
- Canva ను యూజ్ చేయటం ఇంత సులభమా: How to use canva for designing your own way
- నన్నయ భట్టారకుడు జీవితచరిత్ర: తెలుగు సాహిత్య ఆదికవి
One thought on “India Vs South Africa 2nd T20I Highlights|| South Africa Level The Series with1-1 || Cricket News In Telugu”