India Vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో, చివరి టీ20 శుక్రవారం వాండరర్స్ లో జరగనుంది.
Table of Contents
India Vs South Africa:మ్యాచ్ సమ్మరీ
మొదట బ్యాటింగ్ చేసిన భరత్, తిలక్ వర్మ అజేయంగా 107 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 పరుగులతో భారత్ 20 ఓవర్లలో 219/6 పరుగులు చేసింది.చేజింగ్ లో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 208/7 పరుగులు చేసింది. మార్కో జాన్సన్ 17 బంతుల్లో 54 పరుగుల పోరాటం తో ఒకానొక దశ లో దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచే లా కనిపించింది.హార్దిక్ పాండ్య వేసిన 19 వ ఓవర్ లో 26 పరగులు బాదిన జాన్సన్,అర్ష్ దీప్ వేసిన చివరి ఓవర్ లో 24 పరుగులు అవసరం కాగా మొదటి బంతి కి సింగిల్ రాగా,రెండవ బంతికి జాన్సన్ సిక్స్ కొట్టి,3 వ బాల్ కి అవుట్ అవడం తో మ్యాచ్ భరత్ వైపు తిరిగింది.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్
దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో జాన్సన్ అత్యధిక పరుగులు చేయగా, హెన్రిచ్ క్లాసెన్ 22 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఐడెన్ మార్క్రామ్, రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్ వరుసగా 29,21,20 పరుగులతో రాణించారు.
ఇండియా బౌలింగ్
భారత్ బౌలర్లు, అర్షదీప్ సింగ్ దక్షిణాఫ్రికాను 3/37 తో కట్టడి చేయగా, వరుణ్ చక్రవర్తి 54 పరుగులు సమర్పించుకొని రెండు వికెట్లు పడగొట్టాడు.
తిలక్ వర్మ హిట్టింగ్
బ్యాటింగ్ లో తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు, 107 నాటౌట్ గా నిలిచాడు, టీం ఇండియా దక్షిణాఫ్రికా ముందు 219/6 ఒక భారీ టార్గెట్ ను ఉంచింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా, అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించాడు.
22 ఏళ్ల తిలక్ దక్షిణాఫ్రికా బౌలర్లపై దాడిని ప్రారంభించాడు, కేవలం 57 బంతుల్లో ఏడు సిక్సర్లు మరియు ఎనిమిది ఫోర్లు కొట్టాడు, ఈ ఫార్మాట్ లో ప్రోటీస్ పై భారత్ తమ రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసుకుంది.
అభిషేక్ శర్మ విద్వంసం
పరుగుల వరద పారించిన అభిషేక్ శర్మ,అద్భుతమైన అర్ధ సెంచరీతో భారత్ 219/6 సాధించడానికి కీలక పాత్ర పోషించాడు, కేవలం 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు, ఇందులో ఐదు సిక్సర్లు మరియు మూడు ఫోర్లు ఉన్నాయి.
తిలక్ వర్మ & అభిషేక్ శర్మ భాగస్వామ్యం
తిలక్ తన భయంకరమైన స్ట్రోక్లతో రెండవ వికెట్ కు అభిషేక్ తో కలిసి 107 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, సంజు శాంసన్ను మొదటి ఓవర్ లో నే కోల్పోయినప్పటికి తిలక్ మరియు అభిషేక్ బలమైన పునాది ని నిర్మించారు.
ఇతర బ్యాట్స్ మెన్ నిరాశ పరచడం
కేశవ్ మహారాజ్ (2/36) మిడిల్ ఓవర్లలో కట్టడి చేసినప్పటికీ, తిలక్ వర్మ ,చివరి ఆరు ఓవర్లలో కేవలం 22 బంతుల్లో 52 పరుగులు చేసి, భారత్ ను పటిష్ట దశ లో ఉంచాడు.
అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), హార్దిక్ పాండ్యా (18), రింకు సింగ్ (8) అదే పేలవమైన ప్రదర్శన చేసారు.
India Vs South Africa Review 2nd Match