Table of Contents
Kichidi Recipe: ముందుగా కావాల్సినవి తెల్సుకుందాం
- బిర్యానీ ఆకులు 2
- చెక్క 2
- జాజికాయ 1
- లవంగాలు 4
- యాలక్కి బుడ్డలు 3
- జీలకర్ర 1tspn
- మరాఠీ మొగ్గ 1
- రాతి పువ్వు కొద్దిగా
- అల్లం వెల్లుల్లి paste 1tbsn
- ఉల్లిపాయలు 2
- టొమాటో 5
- పచ్చి మిర్చి 6
- పుదీనా 3 tbspn
- కొత్తిమీర 3 tbspn
- నూనె 6 tbspn
- Salt తగినంత
- బియ్యం సోనా మాసూరి 3 glasses
- నీళ్ళు 6 glasses
- పసుపు 1/2 tspn
ఇప్పుడు తయారీ విధానం తెల్సుకుందాం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంట పాటు నానెట్టుకోవాలి. అంత లోపు కావలసిన వి అన్ని రెడీ గా కట్ చేసుకుని ఉంచుకోవాలి.
ఆ తరువాత గ్యాస్ మీద ఒక గిన్నె లో 6 స్పూన్లు నూనె వేసుకోవాలి, నూనె వేడయ్యాక మసాలా దినుసులన్నీ వేసుకుని 3 sec వేపుకుని, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వరకు fry చేసుకోవాలి.
అవి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద నీ వేసి పచ్చి వాసన పోయే అంత వరకు వేవుకుని పచ్చి మిర్చిని మధ్యలోకి కట్ చేసినవి వేయాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని 3 నిమిషాలూ వేపుకోవాలి.
ఆ తర్వాత టొమాటో నీ 4 ముక్కలుగా చేసుకున్న వాటిని వేసి టొమాటోలు బాగా మగ్గే అంతా వరకు మూత పెట్టీ మగ్గించుకోవాలి అలాగే అందులో ఉప్పు పసుపు నీ కూడా వేసుకోవాలి.
ఇవి మగ్గిన తరువాత రైస్ కి కావాల్సిన నీళ్ళని పోసుకుని మరగనివ్వాలి. నీరు బాగా వేడయ్యాక ముందుగా నాన పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి సగం నీళ్లు అన్ని అయిపోయే వరకు మూత పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి.
ఆ తరువాత 3 నిమిషాలూ మీడియం ఫ్లేమ్ లొ ఉంచి, ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు అన్నీ ఇమిరి పోయే అంతా వరకు లో ఫ్లేమ్ లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి.
అంతే చాలా సింపుల్ గా చేసుకోగలిగే కిచిడీ రెడీ అయిపోయింది,దీన్ని దాల్చ తో గాని బుడత తో గాని తినండి సూపర్ గా ఉంటుంది.
మరిన్ని రేసిపీస్ కోసం చుడండి : Harshi Foods Youtube Channel