10 Indian Superfoods to Include in Your Diet: భారతదేశం సంప్రదాయ వంటకాలతో పాటు ఆరోగ్యకరమైన పదార్థాలకు ప్రసిద్ధి. మన పూర్వీకులు వాడిన చాలా పదార్థాలు ఇప్పటికీ తమ పోషక విలువలతో విశేషంగా గుర్తింపు పొందాయి. ఈ సూపర్‌ఫుడ్స్ మన శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తాయి. ఇవి సాధారణ భోజనంలో సులభంగా చేర్చుకోవచ్చు. ఈ పాతకాలపు సంపదను మన ఆహారంలో తీసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుందాం. ఇక్కడ మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన టాప్ 10 భారతీయ సూపర్‌ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
Table of Contents
1. పసుపు (హల్దీ) 10 Indian Superfoods to Include in Your Diet
పసుపు అనేది ప్రతి భారతీయ వంటగదిలో ఉండే ముఖ్యమైన మసాలా. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే కర్క్యుమిన్ అనే యాంటీఆక్సిడెంట్‌తో నిండిఉంది. ఇది జీర్ణశక్తి, మెదడు ఆరోగ్యం, మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇంట్లో సొంతంగా చేసుకునే పసుపు చాలా మంచిది.
ఎలా వాడాలి?
పసుపును కూరలలో, పప్పులో కలపండి. అంతేకాకుండా, పసుపు పాలు తాగితే చలి, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
2. ఉసిరికాయ (ఆమ్లా)
ఉసిరికాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం, చర్మానికి మెరుపు తీసుకురావడం,వెంట్రుకల సమస్యలను నిరోధిస్తుంది ఇంకా అనేక ప్రయోజనాలు అందిస్తుంది.
ఎలా వాడాలి?
ఉసిరికాయను చట్నీగా, పచ్చడిగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. పచ్చడిలో కలిపిన ఉసిరికాయ భోజనానికి ప్రత్యేకమైన రుచి మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది
3. నెయ్యి (Ghee)
నెయ్యి మంచి కొవ్వుల మూలం. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది, మరియు ఎముకల బలాన్ని పెంచుతుంది. నెయ్యిలో ఉన్న శక్తివంతమైన పదార్థాలు మెదడు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం చేస్తాయి.
ఎలా వాడాలి?
రొటీలపై, అన్నంపై నెయ్యి వేసి తినడం సాధారణ పద్ధతి. స్వీట్లు తయారీలో కూడా నెయ్యి వినియోగం ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
4. రాగులు
రాగులు కాల్షియం, ఐరన్, మరియు ఫైబర్‌తో నిండివుంటాయి. ఇవి బరువు నియంత్రణకు, ఎముకల బలాన్ని పెంచడానికి, మరియు రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలా వాడాలి?
రాగి సంకటి, రాగి దోసె, రాగి పాయసం లేదా బిస్కెట్లుగా తయారు చేసి తినండి. రాగిని పిల్లల ఆహారంలో చేర్చడం వారి ఎదుగుదలకి ఎంతో ఉపయోగకరం.
5. మునగ ఆకులు
మునగ ఆకుల్లో విటమిన్ A, విటమిన్ C, మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, చర్మానికి ఆరోగ్యం, మరియు రక్తహీనతకు పరిష్కారాన్ని అందిస్తాయి.
ఎలా వాడాలి?
మునగ ఆకులను పప్పులో, కూరల్లో కలిపి వండండి. కొన్ని ప్రాంతాల్లో మునగ ఆకులతో పులుసు కూడా చేస్తారు, మునగాకు తాలింపు చాల బాగుంటుంది ట్రై చేయండి.
6. అవిసె గింజలు (ఫ్లాక్స్సీడ్స్)
అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మరియు ఫైబర్‌తో నిండివుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, హార్మోన్ సమతుల్యతకు, మరియు జీర్ణశక్తి పెరుగుదలకు తోడ్పడతాయి.డయాబెటిస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో అవి సహాయపడతాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఎలా వాడాలి?
అవిసె పొడిని చట్నీలో, రోటీల మిశ్రమంలో, లేదా ద్రవపదార్థాల్లో కలపడం ద్వారా సులభంగా తీసుకోవచ్చు.
7. కరివేపాకు
కరివేపాకులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి. ఇవి జీర్ణశక్తిని పెంచి, అజీర్తి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కేశాల పెరుగుదలకు, జుట్టు చుక్కల సమస్యను తగ్గించేందుకు కరివేపాకులను ఉపయోగిస్తారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా, డయాబెటిస్ నియంత్రణకు, చర్మ ఆరోగ్యానికి, మరియు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. దీన్ని వంటలలోకి చేర్చుకోవడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఎలా వాడాలి?
తాలింపులో కరివేపాకు వేయడం భారతీయ వంటకాల ప్రత్యేకత. పప్పుల్లో, కూరల్లో కరివేపాకు తప్పనిసరిగా ఉపయోగించండి.ఉపయోగించడమే కాదు వాటిని పక్కన పెట్టకుండా తినేయండి చాలామంది వీటిని వదేలుస్తూ ఉంటారు.
8. కొబ్బరి
కొబ్బరిలో మంచి కొవ్వులు, ఫైబర్, మరియు ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, చర్మాన్ని మెరుగుపరుస్తుంది, మరియు జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది విటమిన్ E, మరియు ఖనిజాలతో నిండిన ఆహార పదార్థం.
ఎలా వాడాలి?
కొబ్బరిని చట్నీల్లో, కూరల్లో కలపడం లేదా కొబ్బరి నీళ్లు పూటకు ఒకసారి తాగడం చాలా మంచిది.
9. పనసపండు (జాక్‌ఫ్రూట్)
పనసపండు (జాక్‌ఫ్రూట్) అనేది పోషక విలువలతో నిండిన ఆరోగ్యకరమైన పండు. ఇందులో పొటాషియం,విటమిన్లు A, C, పీచు, మరియు ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి.
ఎలా వాడాలి?
పచ్చి పనసను కూరగా వండుకోవచ్చు. పండిన పనసను మధురమైన స్నాక్‌గా తీసుకోవచ్చు
10. మొలకెత్తిన గింజలు
మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనవి. వీటిలో పీచు, ప్రోటీన్లు, విటమిన్లు, మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. మొలకలు శరీరానికి తేలికగా జీర్ణమయ్యేలా చేసి, పుష్కలమైన శక్తిని అందిస్తాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో టాక్సిన్లను తొలగించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గే ప్రణాళికల్లో కూడా ఇవి ఉపయుక్తం. మొలకెత్తిన గింజలను రోజువారీ ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి సంపూర్ణ ప్రయోజనాలను అందిస్తుంది.
ఎలా వాడాలి?
ఉదయాన్నే సలాడ్ చేసకొని తింటే మంచిది
Images from:Freepik
Loose Your Belly Fat : మీ బొడ్డు కొవ్వుని ఇలా తగ్గించుకోండి
2 thoughts on “మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 10 సూపర్‌ఫుడ్స్ | 10 Indian Superfoods to Include in Your Diet”