Nutrients packed healthy bowl :ఓట్స్ తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు,ఇప్పుడు పెరుగు తో చాలా టేస్టీ గా ఉండే రిసిపి ఎలా తయారు చేసుకోవాలో తెల్సుకుందాం. ఓట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని వెయిట్ లాస్ రిసిపి గా కూడా చేసుకుని తినొచ్చు.
కావాల్సినవి (Nutrients packed healthy bowl) :
- పెరుగు 1కప్
- తేనే 2tbspn
- చియా సీడ్స్ 2tbspn
- డేట్స్ 4
- Oats 4tbspn
- అరటి పండు 2
![Nutrients packed healthy bowl oats recipe Nutrients packed healthy bowl oats recipe](https://indianewsgallery.in/wp-content/uploads/2024/11/Oats-2.avif)
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ లో 1 కప్ పెరుగుని వేసుకోవాలి,oats వేసుకోవాలి,chia సీడ్స్ నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి .
ఆ తర్వాత డేట్స్ నీ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ,అలాగే అందులో అరటి పండ్లని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి,అలాగే తేనే నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఇందులో కేవలం అరటి పాండే కాదు మీకు నచ్చిన, అందుబాటు లో ఉన్న ఏ ఫ్రూట్ నీ అయినా వేసుకోవచ్చు.అలాగే డ్రై ఫ్రూట్స్ నీ కూడా వేసుకోవచ్చు.ఇంకా సీడ్స్ కూడా వేసుకోవచ్చు.
ఇవి అన్ని వేసిన తర్వాత వీటిని బాగా mix చేసుకుని హాఫ్ n హవర్ పాటు ఫ్రిజ్ లో ఉంచి తినండి.అంతే సూపర్ యుమ్మీ గా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది.
ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరు చాల ఇష్టంగా తింటారు.
క్రింది ఆర్టికల్ కూడా చదవండి మీకు చాలా ఉపయోగ పడవచ్చు
మరిన్ని రెసిపీస్ కోసం చుడండి : Harshi Foods Youtube Channel