కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా | how to do karthika pournami pooja at home|

lord shiva idol at karthika pournami pooja at home

కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా

Karthika Pournami

Karthika Pournami టైమింగ్స్ 2024 :

ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15న తెల్లవారుజామున ఆరు గంటల 31 నిమిషములకు పూర్ణిమతి తీ ప్రారంభమవుతుంది ఈతిథి 16వ తేదీన తెల్లవారుజామున 3 గంటల రెండు గంటలకు ముగియనున్నది. పూజ చేసుకునేందుకు శుభ సమయం ఉదయం 8:46 నిమిషాల నుంచి పది గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది.

కార్తీక పౌర్ణమి పూజా విధానం:

కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిది. కార్తీక మాసం అంతా చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈ పౌర్ణమి రోజు చేసే పూజ మరో ఎత్తు. ఇక పౌర్ణమి రోజు ఒత్తులతో కలిగిన దీపాలను వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే ఈరోజు చేసే పూజలు చాలా భక్తితో చేస్తారు.

ఎన్ని వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు:

ఈ రోజున 365 వత్తులతో దీపాన్ని వెలిగించడం చాలాచోట్ల ఆనవాయితీగా ఉంటుంది. ఈ ఒక్క వొత్తిని సంవత్సరంలో ఒక్కో రోజుగా సూచిస్తాయి. సంవత్సరంలో ఏ రోజైనా పూజ చేయకపోతే ఈ వత్తులు వాటి భర్తీని తీరుస్తాయని నమ్ముతారు.

how to do karthika pournami pooja at home

కార్తీక పౌర్ణమి పూజా విధానం మరియు నియమాలు:

పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం పరచుకోవాలి. 365 వత్తులను ముందుగానే నూనెలో గాని నెయ్యిలో గాని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ రోజంతా పాలు పండ్లతో ఉపవాసం చేయాలి. పూజ అయిపోయిన తర్వాత భోజనం తినవచ్చు. మీ ఇంట్లో ఉసిరి చెట్టు మరియు తులసి చెట్టు ఉంటే అవి రెండు ఉంచుకొని పూజ చేస్తే ఇంకా మంచిది. తులసి కోటని ముందుగా శుభ్రం చేసుకొని దాని ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. తులసి కోటని పూలతో అలంకరించుకోవాలి. తులసి కోట ఇరువైపులా దీపాలను వెలిగించాలి. మొదటగా గణపతి పూజతో మొదలుపెట్టి పసుపు కుంకుమలతో దీపారాధన చేసుకోవాలి. తర్వాత కలశం పూజ చేసుకోవాలి. గణపతి అష్టోత్తరకాలు చదువుతూ పూలు ధూపం దీపం సమర్పించుకోవాలి. తర్వాత మంగళహారతిని ఇవ్వాలి.

ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్కన ఆకుపైన ప్రమిదను పెట్టుకొని పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి. అందులో ముందుగా నానబెట్టుకుని సిద్ధంగా ఉంచుకున్న 365 వత్తులను ఉంచి వెలిగించుకోవాలి. మీకు గనక ఉసిరి దీపం పిండి దీపం కూడా సాంప్రదాయం ఉంటే పక్కనే వెలిగించుకోవచ్చు. తర్వాత నైవేద్యం సమర్పించుకోవాలి.

Images From : Leonardo.ai

One thought on “కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా | how to do karthika pournami pooja at home|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *