సంజు సంసన్ సెంచరీ||భరత్ చేతిలో సౌత్ ఆఫ్రికా భారీ ఓటమి

పరుగుల వరద సృష్టించిన సంజు శంసన్

సంజూ శాంసన్ వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. డర్బన్లో జరిగిన తొలి టీ20 లో సంజు శాంసన్ సెంచరీ, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ల అద్భుతమైన బౌలింగ్ తో భారత్ దక్షిణాఫ్రికాను 61 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు వరద తో, 202/8 కి చేరుకోవడానికి సహాయపడింది. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ ను చక్రవర్తి, బిష్ణోయ్ అణచివేశారు, సౌత్ ఆఫ్రికా కేవలం 17.5 ఓవర్లలో మొత్తం 141 పరుగులకే కుప్పకూలిపోయింది.

సంజూ శాంసన్ వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. శాంసన్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు మరియు అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు మరియు 10 సిక్సర్లు ఉన్నాయి. 16వ ఓవర్‌లో న్‌కాబయోమ్జీ పీటర్‌ శంసన్ ని ఔట్ చేసాడు. భారత బ్యాటర్ల లో సుర్యకుమార్ యాదవ్ 17 బంతుల్లో 21 మరియు తిలక్ వర్మ 18 బంతుల్లో 33 పరుగులతో రాణించారు. చివరికి ఇండియా 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టం తో 202 పరుగులు సాధించింది.

203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణ ఆఫ్రికా తరపున హెన్రిచ్ క్లాసెన్ (25) అత్యధిక స్కోరు సాధించగా, కోట్జీ (23) మరియు ర్యాన్ రికెల్టన్ (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేసారు. అయితే, భారత స్పిన్నర్లు, ముఖ్యంగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ని దెబ్బతీయడంతో దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్ మెన్ సరైన భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయారు. బిష్ణోయ్, చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీయగా, అవేష్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీశారు.వీరి దెబ్బకి దక్షిణాఫ్రికా కేవలం 17.5 ఓవర్లలో మొత్తం 141 పరుగులకే కుప్పకూలిపోయింది.రెండవ టీ20 మ్యాచ్‌ గెబెర్హా, సెయింట్ జార్జ్ పార్క్ లో నవంబర్ 10 న సాయంత్రం జరగనుంది.

One thought on “సంజు సంసన్ సెంచరీ||భరత్ చేతిలో సౌత్ ఆఫ్రికా భారీ ఓటమి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *