1.అత్యధిక టీ20స్కోరు

బరోడా జట్టు సిక్కిం పై 349 పరుగులు చేసి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది.

2.గాంబియాపై జింబాబ్వే రికార్డు బద్దలైంది

బరోడా ఈ స్కోరుతో 344 పరుగుల నైరోబీ రికార్డును అధిగమించింది.

3.37 సిక్సర్లతో కొత్త చరిత్ర

బరోడా ఆటగాళ్లు మొత్తం 37 సిక్సర్లు కొట్టి, జింబాబ్వే (27 సిక్సర్లు) రికార్డును బ్రేక్ చేశారు.

4.అభిమన్యు-శాశ్వత్ భారీ  ఓపెనింగ్

పవర్‌ప్లేలోనే 92 పరుగుల భాగస్వామ్యం ఇచ్చిన శాశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్ జట్టు విజయానికి బలమైన పునాది వేశారు.

5.భాను పానియా సెంచరీ చెలరేగడం

భాను పానియా 42 బంతుల్లో 134 పరుగులు చేసి మ్యాచ్ హిరోగా నిలిచాడు.

6.శివాలిక్, సోలంకి అర్ధసెంచరీలు

17 బంతుల్లో 55 పరుగులు చేసిన శివాలిక్, 16 బంతుల్లో 50 చేసిన సోలంకి స్కోరును మరింత పెంచారు.

7.సిక్కిం లక్ష్యాన్ని చేధించలేకపోవడం

సిక్కిం జట్టు 86 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారీ పరాజయం చవిచూసింది.కృనాల్ పాండ్యా, నినాద్ రత్వ, మహేశ్ పిథియా కలిసి 5 వికెట్లు తీశారు.

8.263 పరుగుల విజయంతో రికార్డు

బరోడా జట్టు టీ20 క్రికెట్‌లో పరుగుల పరంగా నాలుగో అత్యధిక విజయం సాధించింది.

9.సీజన్‌లో బరోడా ఆధిపత్యం

బరోడా జట్టు రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండింటిలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది.