అనుష్క శెట్టి మూవీ సెట్ లో Prabhas

prabhas in anushka shetty movie set

కొన్ని రోజుల క్రితం అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన చిత్రం ‘ఘాటి’ టీజర్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.తాజా సమాచారం ప్రకారం,’ఘటి’ చిత్రం సెట్లను ప్రభాస్ సందర్శించినట్లు చెబుతున్నారు.అనుష్క శెట్టి ‘భాగమతి’ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా ప్రభాస్ అనుష్కా సినిమా సెట్లలో కనిపించడం విశేషం.

Prabhas in ghaati movie

2009 లో ‘బిల్లా’ సినిమా లో కలిసి నటించినప్పటి నుండి ,ప్రభాస్ మరియు అనుష్కా శెట్టి రిలేషన్షిప్ పుకార్లకు కేంద్రంగా ఉంది. ఇద్దరూ తాము కేవలం స్నేహితులమని నిరంతరం పేర్కొన్నప్పటికీ, ‘బిల్లా’ లో వారి కాదనలేని కెమిస్ట్రీ మరియు ‘మిర్చి’ మరియు ‘బాహుబలి’ వరుస సినిమా లో నటించడం వలన ఊహాగానాలకు ఆజ్యం పోశాయి.

ఇటీవల ఆవిష్కరించిన ‘ఘాటి’ పోస్టర్ మరియు టీజర్ చూస్తుంటే,. మరోసారి అరుంధతి,భాగమతి వంటి స్ట్రాంగ్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ తో అలరించనుంది అని అర్థం అవుతోంది.క్రిష్ఈ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం 22 Mar 2025 న రిలీజ్ కానుంది.

మరోవైపు, ప్రభాస్ “సలార్ పార్ట్ 2: శౌర్యంగా పర్వం” యొక్క మొదటి పోస్టర్ కూడా ఇటీవల దక్షిణ కొరియా-అమెరికన్ స్టార్ డాన్ లీ విడుదల చేశారు.

సాలార్ పార్ట్ 2 మొదటి భాగం ముగిసిన చోటనే ప్రారంభమవుతుందని, రెబల్ స్టార్ అభిమానులకు యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌ను అందిస్తోందని, ఇది పార్ట్ 1 కంటే మరింత గ్రిప్పింగ్ మరియు ఇంటెన్స్‌గా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వాగ్దానం చేసారు.ఇక ప్రభాస్ ఫాన్స్ పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అమరన్ మూవీ కాంట్రవర్సీ

See More About Ghaati Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *